Pages

WELCOME TO GDS RAMACHANDRAPURAM TO ALL VIEWERS

Sunday, 2 August 2015

  • రైతుకు 25 వేల వరకు రుణం: దత్తాత్రేయ
  • ఉపాధి కల్పనతో పోస్టాఫీసుల అనుసంధానం
  • పంట ఫొటో తీసి వెబ్‌సైట్లో విక్రయం
  • తెలంగాణలో ప్రయోగాత్మక అమలు
హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): చిన్న చిన్న రుణాల కోసం రైతు బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లో తపాలా బ్యాంకులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం తపాల, టెలికాం, ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా) శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘గ్రామగ్రామాన సేవలు అందిస్తున్న తపాల శాఖను కేంద్ర పథకాల అమలుకు సమర్థంగా ఉపయోగించుకోవాలని భావిసున్నాం. ఇందులో భాగంగా తొలిదశలో తెలంగాణలో ప్రయోగాత్మకంగా గ్రామాల్లో తపాల బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తాం. తద్వారా చెల్లింపులతో పాటు రైతుకు రూ.25 వేల వరకు రుణాలు అందించాలని భావిస్తున్నాం. దానికి అవసరమైన లైసెన్సు కోసం కృషి చేస్తాం’’ అని ఆయన అన్నారు. రైతులు పండించిన పంటల్ని ఫొటోలు తీసి, అందుబాటులో ఉన్న పంట మొత్తాన్ని ఒక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, ఆసక్తి ఉన్న వారు వచ్చి పంట కొనుగోలు చేసుకోవచ్చుని దత్తాత్రేయ చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా దళారులను నియంత్రించి రైతులకు నేరుగా ప్రయోజనం అందేలా చూస్తామన్నారు. పంట కొనుగోలు తరువాత రవాణా బాధ్యత తపాల శాఖ చూసుకుంటుందని వివరించారు. అంతేగాకుండా.. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఉపాధి కల్పనా కేంద్రాలను పోస్టల్‌ శాఖతో అనుసంధానిస్తామని, తద్వారా గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగాన్ని అంచనా వేసి ఉద్యోగాలపై సర్వే చేస్తామన్నారు. ఇక టెలిఫోన్‌ శాఖ ద్వారా రెండు రాషా్ట్రల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టిక్‌ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటును మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. బ్యాంకులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పోస్టాఫీసులు, సెల్‌ టవర్లు, టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌లకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్‌ను అందజేస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగుళూరు లాంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని పలు పట్టణాలకూ విస్తరిస్తామని దత్తాత్రేయ అన్నారు.

No comments:

Post a Comment